Ranbir Kapoor : బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడ్డం కారణంగా తన కెరీర్లోనే ఓ సినిమా భారీ డిజాస్టర్ అయిందని వాపోయారు. ఈ సినిమా వల్ల దాదాపు 150కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఆ సినిమా మరేదో కాదు జులై నెలలో విడుదలైన షంషేరా. ఈ మూవీలో రణ్ బీర్ అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Read Also: Thalapathy Gift to Yogi babu: యోగిబాబుకు విజయ్ క్రికెట్ బ్యాట్ గిప్ట్
రణ్ బీర్ కపూర్ ఇటీవల దుబాల్ జరిగిన ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షంషేరా మూవీ డిజాస్టర్ కావడానికి చిత్ర బృందం చేసిన పొరపాట్లు ప్రధాన కారణమని తెలిపారు. అందులో తాను పెట్టుకున్న గడ్డం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. కృత్రిమ గడ్డం పెట్టుకోవడం వల్ల… ఎండలో షూటింగ్ చేసే సమయంలో అది సరిగా కనిపించలేదు. ముఖానికి అతుక్కుని ఉన్నట్లు కనిపించింది. అందుకే షంషేరా సినిమా ఫ్లాప్ అయిందనుకుంటా అని అన్నారు.
Read Also: Pawan Kalyan: రేపే మొదలుపెట్టనున్న హరీష్ శంకర్… ఫాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో?
బాలీవుడ్‌లో రొమాంటిక్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఈ జంటకు ఇటీవలే ఓ కూతురు జన్మించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ ఏడాది రిలీజైన బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని అందుకుంది. అయితే జూలైలో విడుదలైన మూవీ ‘షంషేరా’ రణబీర్ కెరీర్‌లో ఓ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాన్ని రణ్‌బీర్ వెల్లడించారు. షంషేరా చిత్రం ఫ్లాప్ కావడానికి గడ్డమే మెయిన్ రీజన్ కావచ్చని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు. కాగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న యానిమల్‌లో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా రణ్‌బీర్‌కు జోడీగా నటిస్తోంది.