సోమవారం నుండి సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో వరుసగా ఒక్కో శాఖతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలు, పంపిణీ దారులు, ఎగ్జిబిటర్స్ సమావేశం అవుతూ వస్తున్నారు. మంగళవారం డిజిటల్ ప్రొవైడర్స్ తో సమావేశం అయిన నిర్మాతలు, బుధవారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గంతోనూ సంప్రదింపులు జరిపారు. అయితే ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ విషయంలో ‘మా’ సభ్యులు నిర్మాతలకు ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ, నిర్మాతల కష్టానష్టాలపై సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ‘మా’ అధ్యక్షుడు…
ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1935 ఆగస్ట్ 15న కారంచేడులో జన్మించిన రాజేంద్రప్రసాద్ 1959 నుంచి 65 వరకూ చీరాలలో బెంచ్ మెజిస్ట్రేట్ గా పని చేశారు. ఆ తర్వాత రామానాయుడుతో కలసి కారంచేడులో రైస్ మిల్ నిర్వహించిన రాజేంద్రప్రసాద్ రామానాయుడు, మిత్రుడు జాగర్లమూడి సుబ్బారావుతో కలసి సురేశ్ సంస్థను స్థాపించారు. అందులో రాజేంద్రప్రసాద్, సుబ్బారావుది 40 శాతం. ‘రాముడు-భీముడు, శ్రీకృష్ణ తులాభారం, ప్రతిజ్ఞ, స్త్రీ జన్మ, ఒక చల్లని…
సినీనటి సాయిపల్లవి ని సాదరంగా స్వాగతించి చిరు సత్కారం చేశారు సరళ కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలో కామంచికల్ గ్రామస్తులు తూము భిక్షమయ్య చిన్న కూతురు సరళ యొక్క జీవిత కథని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా విరాటపర్వం. ఐద్వా నాయకురాలు వడ్డే పద్మ గారి చెల్లెలే అమర జీవి సరళ. సరళ పాత్రను అద్భుతంగా నటించిన (జీవించిన) ప్రముఖ నటి సాయి పల్లవిని తమ ఆడబిడ్డ గా ఇంటికి పిలిచి చీరె…
నందమూరి నటసింహం చిలకలూరిపేటలో సందడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ వేడుకల్లో దర్శకుడు బోయపాటి శ్రీను, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అశేష ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య డైలాగ్స్ తో అభిమానుల్లో జోష్ నింపారు. వంద రోజులు వినడమే గగనమైన రోజుల్లో సింహా, లెజెండ్ అఖండ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఆనందంగా…
కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాటే కళ్యాణి మరియు మౌక్తిక నిన్న వెళ్లారు.. ఎక్కడికి వెళ్ళారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు..నిన్నటి నుండి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని.. నా కూతురు పై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని మాపైనే ఆరోపణలు చేస్తున్నారని… శ్రీకాంత్ రెడ్డి నా కూతురు పై అటాక్ చేస్తానని బెదిరించాడని వెల్లడించారు. నిన్నటి నుండి కూతురు కళ్యాణి, పాపా మౌక్తిక ను ఎవరు తీసుకొని…
(మే 16తో ‘వీరకంకణం’కు 65 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన జానపద చిత్రం ‘వీరకంకణం’ ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది. 1950లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ ‘వీరకంకణం’ తెరకెక్కింది. ఆ సినిమాను నిర్మించిన మోడరన్ థియేటర్స్ సంస్థ ‘వీరకంకణం’ను తెలుగులోనూ నిర్మించింది. 1957 మే 16న ‘వీరకంకణం’ చిత్రం విడుదలయింది. ‘వీరకంకణం’ కథ ఏమిటంటే- ఓ దేశానికి రాజైన వెంగళరాయ దేవ అమాయకుడు. తమ రాజగురువు…