Kantara movie: రిషబ్ శెట్టి రూపొందించిన ‘కాంతారా’ విడుదలై రెండు నెలలు పూర్తి చేసుకుంది. సెప్టెంబరు 30న విడుదలైన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా అందుబాటులో ఉంది. అయినా ఇప్పటికీ థియేటరల్లో చక్కటి వసూళ్ళను సాధిస్తోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే ‘కాంతారా’ మరో ఘనతను సాధించబోతోంది. నిజానికి రిషబ్ శెట్టి ముందు ఈ సినిమాను కన్నడ భాషలో మాత్రమే విడుదల చేశారు. కన్నడ నాట అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలలో డబ్ చేసి విడుదల చేశారు. అన్ని చోట్లా సూపర్ సక్సెస్‌గా నిలిచింది. దీంతో తులు వెర్షన్‌లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది.
Shruti Hassan: అప్పుడు సిమ్రాన్… ఇప్పుడు శ్రుతిహాసన్!
ఇదిలా ఉంటే ‘కాంతారా’ నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని త్వరలో ఆంగ్ల వెర్షన్‌లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ధృవీకరించారు. అయితే ఈ ఇంగ్లీష్ వెర్షన్ థియేటర్లలో విడుదల చేస్తారా? లేక డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఇదే నిజం అయతే కన్నడ చిత్ర పరిశ్రమలో ఓ రేర్ ఫీట్ అనే చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోనా’ ను ఇంగ్లీషులో డబ్ చేసి విడుదల చేస్తామన్నారు. అయితే డబ్బింగ్ పూర్తి చేసినా రిలీజ్ మాత్రం చేయలేదు. కన్నడనాట బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన ‘కెజిఎఫ్1, కెజిఎఫ్2’ సినిమాలు ఆంగ్ల భాషలో రిలీజ్ కాలేదు. దాంతో ‘కాంతారా’ రిలీజ్ అయితే చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. ఇక దర్శకుడు-నటుడు రిషబ్ శెట్టి ‘కాంతారా’ పార్ట్ 2 కోసం స్క్రిప్ట్ వర్క్ ను ప్రారంభించినట్లు తెలియవస్తోంది. అదే నిజమైతే సెకండ్ పార్ట్ ఆరంభానికి ముందే హాట్ కేక్ లా అమ్ముడు పోవడం ఖాయం. ఏమంటారు!?