ఈ ఏడాది వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం లో ‘ద కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు తాజాగా ‘ద వాక్సిన్ వార్’ అనే సినిమాతో రాబోతున్నారు. పల్లవి జోషి కి చెందిన ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఈ సినిమాను 11 భాషల్లో నిర్మించిన ఆగస్టు 15, 2023న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్ళను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘ద కాశ్మీర్ ఫైల్స్’. ఆ సినిమా విజయం స్ఫూర్తితో తీయనున్న ‘ద వాక్సిన్ వార్’ దేశంలోని కోవిడ్ 19, టీకా వంటి వాటిపై పోరాటమని తెలుస్తోంది. అందుకేనేమో పోస్టర్‌లో ‘మీకు తెలియని యుద్ధం మీరు పోరాడి గెలిచారు’ అని ఉంది.
Also Read : Madhuri Dixit : అందరికీ వయసు పెరుగుతోంటే.. ఈమెకు తగ్గుతోంది..!
త్వరలో సెట్స్‌పైకి వెళ్లే సినిమా రిలీల్ డేట్ కూడా లక్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో తీసి విడుదల చేయనున్నారు. బయో సైంటిస్టుల విజయం ప్రధానంగా తెరకెక్కబోతున్నట్లు నిర్మాతల్లో ఒకరైన పల్లవిజోషి తెలియచేస్తున్నారు. ఈ సినిమాకు సబంధించి నటీనటులను ఇతర సాంకేతిక నిపుణులను ప్రకటించలేదు. మరి ‘ద వాక్సిన్ వార్’ కాశ్మీర్ ఫైల్స్ లా విజయం సాధిస్తుందేమో చూడాలి.