సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని, భారతదేశంలో అతిపెద్ద థియేటర్స్ చైన్ పివిఆర్ సినిమాస్ డిసెంబర్ 9 నుండి 15 వరకు చెన్నై, కోయంబత్తూరులో ఎంపిక చేసిన థియేటర్లలో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ‘సూపర్‌స్టార్ రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఆయన నటించిన సినిమాలను ప్రదర్శిస్తున్నారు. 7 రోజుల ఫెస్టివల్‌లో 4 సూపర్‌హిట్ చిత్రాలు ‘బాబా (2002), శివాజీ: ది బాస్ (2007), 2.0 (2018), దర్బార్ (2020)’ను ప్రదర్శిస్తున్నారు.
Also Read : Puri Jagannadh: పూరి జగన్నాథ్ జీవితంలో సగం రోజులు గొడవలేనట
ఈవిషయమై పివిఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమ్ దత్తా మాట్లాడుతూ ‘రజినీకాంత్ గారు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు. ఆయన అభిమానులకు ఇది అద్భుతమైన అవకాశం’ అని అన్నారు. ఈ స్పెషల్ ఫిల్మ్ ఫెస్టివల్ తో పాటు ‘బాబా’ అప్‌డేట్ వెర్షన్ విడుదల గురించి శ్రీమతి లతా రజినీకాంత్ మాట్లాడుతూ, ’20 ఏళ్ల క్రితం విడుదలైన బాబా ఓ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. బాబా మా కుటుంబానికి అనేక విధాలుగా చాలా ప్రత్యేకమైన చిత్రం. మరోసారి ఈ చిత్రానికి థియేటర్లలో ఘన స్వాగతం పలికిన అభిమానులకు, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.