ఏపీలో సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇకపై ఆన్ లైన్లోనే టికెట్ల విక్రయం జరగనుంది. దీనిపై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్టు ఏపీ సర్కారు ప్రకటించింది. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రోజుకు కేవలం 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఏపీలో సినిమా టికెట్ బుకింగ్‌కి సంబంధించి ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సైతం సినిమాటోగ్రఫి శాఖ…
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేబీఆర్ పార్క్‌లో నటి చౌరాసియాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి చౌరాసియాపై లైంగిక దాడి జరిగిందని వార్తలు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. నటి చౌరాసియా పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, కేవలం సెల్‌ఫోన్ దొంగలించడం కోసమే ఆమెపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడని వారు వెల్లడించారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు…
బ్రదర్ ఆఫ్ దేవరకొండ (ఆనంద్ దేవరకొండ).. న్యూ మూవీ ‘పుష్పక విమానం’. దొరసాని సినిమాతో కథనాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు ఆనంద్ దేవరకొండ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సొదరుడైనా కూడా.. తన దైన నటనా శైలితో ముందుకు వెళుతున్నారు. దొరసాని సినిమా తరువాత ఆనంద్ నటించిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్.. ఈ సినిమా కరోనా లాక్‌డౌన్ కారణంగా ఓటీటీలో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఓటీటీలో మంచి విజయాన్నే సాధించింది.…
అనసూయ భరద్వాజ్. ఈ పేరు చెబితే చాలు కుర్రకారు జబర్దస్త్ విందు చేసుకుంటారు. షో ప్రారంభమై ఎన్నేళ్ళయినా ఖతర్నాక్ డ్యాన్స్ లతో ఆమె బుల్లితెర ప్రేక్షకుల్ని కనువిందు చేస్తుంటుంది. స్కిట్ స్కిట్ల మధ్యలో అనసూయ చేసే డ్యాన్స్ లు కుర్రకారుని మతి పోగొడుతుంటాయి. బుల్లితెర కాదు వెండితెర పై కూడా అనసూయ అలరిస్తూనే వుంది. వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి…
కళాకారులు కళానైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ… అదే కళాకారుడు ఓ హీరోకు వీరాభిమాని అయితే.. ఆ హీరో మరణిస్తే.. అప్పుడు తన గుండెలోతులోంచి వచ్చిన ఆలోచనను పెయింటింగ్ వేశాడో అభిమాని. ఆ పెయింటింగ్ చూసిన వారు కళ్లు చేమర్చక మానరనడంలో సందేహం లేదు. ఇంతకు ఎవరిదీ పెయింటింగ్ అనుకుంటున్నారా.. ఇటీవల గుండె పోటు మృతి చెందిన పునీత్ తన తండ్రి రాజ్ కుమార్‌ను స్వర్గంలో కలుసుకున్నట్లు ఆ పెయింటింగ్ చెబుతోంది. బెంగుళూరుకు చెందిన కరణ్ ఆచార్య…
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ల కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7న సంక్రాంతి వేడుకలకు మరింత ఉత్సహాంగా జరుపుకునేందుకు చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రోజు దీపావళి కానుకగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్’ అంటూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు…