Rajinikanth: రజినీకాంత్ జపం చేస్తున్న సోషల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు కానీ ఆ స్టార్ హీరోలతో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక హీరో రజినీకాంత్. బ్లాకు అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటి మోషన్ గ్రాఫిక్స్ వరకూ ప్రతి టెక్నాలజీలో సినిమా చేసిన హీరో రజినీకాంత్ మాత్రమే. తన స్టైల్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన రజినీ పేరు వినగానే ఇప్పటికీ అభిమానులకి గుర్తొచ్చే సినిమా బాషా. ఒక మాఫియా డాన్ సినిమా ఎలా ఉంటుందో? మాఫియా డాన్ ఎలా ఉంటాడో చూపించిన సినిమా బాషా. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజినీ స్టైల్ అండ్ డైలాగ్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్క్రీన్ ప్లే పరంగా కూడా బాషా అప్పటికి చాలా అడ్వాన్స్ ఉంటుంది. ఇంకో పది ఇరవయ్యేళ్లు అయినా సూపర్ స్టార్ ఫాన్స్ బాషా సినిమాని, అందులో వచ్చే బాషా బాషా అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని మరిచిపోలేరు. ఆ మూవీకి, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కో్‌ర్‌కి ఉన్న క్రేజ్ ఏంటో నిరూపిస్తూ తమిళనాడులో ఒక ఈవెంట్ జరిగింది.
Varisu: వాళ్ల రాకతో ‘వారిసు’ రేంజ్ పెరిగింది…
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తమిళనాడులో ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవా, ఒక కాన్సెర్ట్ పెట్టారు. ఈ కాన్సెర్ట్‌కి రజినీకాంత్ చీఫ్ గెస్టుగా వచ్చారు. మ్యూజికల్ నైట్‌లో దేవా కంపోజ్ చేసిన ఎన్నో హిట్ సాంగ్స్ కొంతమంది సింగర్స్ స్టేజ్ పైన పాడి అక్కడికి వచ్చిన ఆడియన్స్‌ని మెప్పించారు. ఇంతలో రజినీకాంత్‌ని స్టేజ్ పైకి పిలుస్తూ, సింగర్స్ అండ్ దేవా బాషా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని హమ్ చేయడం మొదలుపెట్టారు. అంతే అప్పటివరకూ సందడిగా ఉన్న ఆడిటోరియుం ఒక్కసారిగా బాషా బాషా అంటూ రచ్చ చేసింది. అంతమంది అరుపుల మధ్య, తన ట్రేడ్ మార్క్ లాంటి ఆర్ ఆర్ మధ్య రజినీకాంత్ నడుచుకుంటూ స్టేజ్‌పైకి వెళ్లిన సీన్ సూపర్బ్ అంతే. సినిమాని తలపించేలా జరిగిన ఈ ఇన్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లైవ్‌లో రజినీ స్వాగ్‌ని మిస్ అయిన వాళ్లు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటే, లైవ్‌లో చూసిన వాళ్లు బాషా మూమెంట్‌ని రీలివ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!