Pakistan: ఖమేనీ మరణం.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ‘‘డబుల్ ట్రబుల్’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం పాకిస్తాన్ చావుకొచ్చినట్లు ఉంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. యూఎస్, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచీతో పాటు రాజధాని ఇస్లామాబాద్, లాహోర్‌తో సహా అన్ని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీలో ఏకంగా యూఎస్ ఎంబసీపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఎంబసీ కాంపౌండ్‌లోకి ప్రవేశించడానికి చూసిన మూకపై యూఎస్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా మరణించారు.
ఈ వ్యవహారం మొత్తం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు మునీర్ డబుల్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో షరీఫ్, మునీర్‌లు ఇద్దరూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో అంటకాగుతున్నారు. ట్రంప్ వీరిద్దరిపై పదే పదే ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, యూఎస్-ఇజ్రాయిల్‌లు కలిసి ఖమేనీని చంపేశారని పాక్ ప్రజలు నమ్ముతున్నారు. దీంతో అమెరికాతో దగ్గరగా ఉన్న మునీర్‌పై పాక్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
Read Also: Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..
మరోవైపు అమెరికాను కాదని ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో పాక్ ఉంది. ట్రంప్‌కు ఎదురు తిరిగితే ఏమవుతుందో షరీఫ్, మునీర్‌లకు తెలుసు. మరోవైపు, స్వదేశంలో విమర్శలు. ఇలా రెండు వైపులా ఒత్తిడి ఎదురవుతోంది. ఖచ్చితంగా పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఇంట్రెస్టుల్ని రక్షించాల్సిందే. పాక్ ప్రతిపక్షాలు, ఇతర మత సంస్థలు మాత్రం మునీర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పాక్ పరిస్థితి చూస్తే కర్ర విరగకుండా, పాము చావకుండా చేస్తుంది. ఓ వైపు నిరసనకారుల్ని శాంతింప చేసేందుకు శాంతియుత నిరసనలకు అనుమతి ఇస్తోంది. మరోవైపు, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. రాజధాని ఇస్లామాబాద్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా రోడ్లపైకి వచ్చారు. నిరసనకారుల్ని శాంతిపచేయడానికి ఉలేమాలతో సమావేశం నిర్వహించారు. అల్లర్లను పరిష్కరించాలని కోరారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
-
Asian Games 2026 Shooting: ఏషియన్ గేమ్స్ 2026లో భారత షూటర్ల హవా.. స్వర్ణంతో మెరిసిన కమల్జీత్- సురుచి
-
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!