IND vs WI: ఈడెన్‌లో వెస్టిండీస్ ప్లేయర్ల గర్జన.. భారత్ ముందు భారీ లక్ష్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies Super 8: కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య సుపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత్ ముందు 196 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది.టీమిండియాకు సవాల్‌గా మారింది. ఓపెనర్లు రోస్టన్ చేజ్(40), షాయ్ హోప్(32) పరుగులతో మెరిశారు. చివర్లో జాసన్ హోల్డర్(37), రోవ్‌మన్ పావెల్(34) రెచ్చిపోయారు. బూమ్రా రెండు, హార్దిక్ పాండ్యా ఒకటి, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసుకున్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కాగా.. వెస్టిండీస్ బ్యాటింగ్‌ను షాయ్ హోప్, రోస్టన్ చేజ్‌లు ప్రారంభించారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆరంభించారు. ఎనిమిది ఓవర్ల వరకు ఔట్ కాకుండా జాగ్రత్తగా ఆడారు. తొమ్మిదవ ఓవర్లో, వరుణ్ చక్రవర్తి షాయ్ హోప్ వికెట్‌తో భారత్‌కు తొలి బ్రేక్ త్రూ అందించాడు. హోప్ 33 బంతుల్లో 32 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 12వ ఓవర్లో బుమ్రా హెట్మైర్‌ను అవుట్ చేశాడు. హెట్మైర్ 12 బంతుల్లో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే ఓవర్లో బుమ్రా చేజ్ (40) పెవిలియన్‌కు పంపాడు. 15వ ఓవర్లో హార్దిక్ పాండ్యా రూథర్‌ఫోర్డ్(14)ను అవుట్ చేశాడు. హోల్డర్(37), రోవ్‌మన్ పావెల్(34) నాటౌట్‌గా నిలిచారు.
READ MORE: Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?