Dochevarevarura Movie: ఐ క్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారేవారురా!’. ఈ సినిమా నుంచి తాజాగా ‘కల్లాసు అన్ని వర్రీసూ… నువ్వేలే.. నీ బాసూ..’ పాటను గుంటూరు మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు చేతులు మీదుగా విడుదల చేసారు. ఈ సందర్భంగా మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ ‘శివనాగేశ్వరరావుగారి మనీ సినిమా నా స్కూల్ డేస్ లో చూశా. ఆ రోజుల్లో అది ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత చాలా మంచి సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. ఈ రోజు ఆయన సినిమా పాటను నేను విడుదల చేయడం అదృష్టం గా భావిస్తున్నాను’ అని అన్నారు.
NBK108: రేపే బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా ఆరంభం
దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ‘మహిళల స్వేచ్ఛ గురించి వచ్చే ఈ పాటను ఈ మహిళా కాలేజ్ లో విడుదల చేయాలని మలినేని పెరుమాళ్ళుగారిని అడిగాము. ఆయన ఎంతో ప్రేమ గా, ఆప్యాయంగా పాటను రిలీజ్ చేసినందుకు కృతజ్ఞతలు. ఈ పాటకు సింగింగ్, డాన్స్ పోటీ పెట్టారు. బాగా పాడిన వాళ్లకు, డాన్స్ చేసిన వాళ్లకు నా తదుపరి సినిమాలో అవకాశం ఇస్తాను. కామెడీ, థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం’ అని తెలిపారు. హీరోయిన్ మాళవిక సతీషన్ మాట్లాడుతూ ‘ఈ కాలేజ్ లో మీ అందరి సమక్షంలో సాంగ్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. సినిమా చూసిన అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ కావాలి’ అని అన్నారు.