మణిపూర్లో ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయిన రోజుల తర్వాత వారిని కిడ్నాప్ చేసి చంపిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ బృందం బుధవారం మధ్యాహ్నం ఇంఫాల్ చేరుకుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సీఎం నివాస పునరుద్ధరణ కేసులో సీబీఐ కేసు నమోదు చేయడమే కారణం. ఢిల్లీ సీఎం నివాసం పునరుద్ధరణలో జరిగిన కుంభకోణంపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఆయేషా హత్య కేసులో ఆయేషా తల్లిదండ్రులను విచారించేందుకు సీబీఐ అధికారులు వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో వారిని కలిసిన అధికారులు.. మరొకసారి డిటైల్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు.
Bribery Case: ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని సహా ఏడుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తులు టెండర్ కోసం లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టెండర్ ఒడిశాలోని ఓ పాఠశాలకు సంబంధించి రూ.19.96 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది.
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిపై ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు వారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది.
దాణా కుంభకోణం కేసులో వైద్య కారణాలతో బెయిల్ పొందిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారని, బీహార్ మాజీ ముఖ్యమంత్రికి మంజూరైన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో జగదీష్ టైట్లర్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్లోని ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు గుంపును ప్రేరేపించి, మైదానంలో అల్లర్లకు నాయకత్వం వహించారని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరోపించింది.