Mamata Banerjee: బీజేపీకి బెంగాల్ సీఎం, తృణమూల్ సుప్రీమో మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన నలుగురిని కేంద్ర ఏజెన్సీలు అరెస్ట్ చేశాయని, రాష్ట్ర పోలీసులు ఇందుకు ప్రతిగా 8 మంది బీజేపీ నాయకులను జైలులో పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు.
Fake Job Racket: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం (నవంబర్ 10) రట్టు చేసింది.
జగనన్న పాల వెల్లువ కాదు.. పాపాల వెల్లువ అని స్పష్టంగా చెప్పాం. జగనన్న పాల వెల్లువ పేరుతో దోపిడీ జరిగింది. జగన్ పాల వెల్లువ.. జగనన్న చేయూత చక్కగా అమలైతే రూ. 14500 కోట్లు మహిళలకు చేరేవి. మా విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.. కానీ, పార్టీ పరంగా వైసీపీ మాత్రం కౌంటర్ ఇచ్చిందని మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. ఇదిలా ఉంటే మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ చేయాలని యాంటీ-కరప్షన్ ప్యానెల్ ఆదేశించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Supreme Court: విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
CBI EX JD Lakshminarayana Tweet Goes Viral: తాజాగా శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే. తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లగా.. అక్కడే పర్యటిస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని కలిశారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేను సీబీఐ మాజీ జేడీ ఆహ్వానించారు. అదే సమయంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రోగ్రాం జరుగుతుండగా అందులో…
DK Shiva Kumar: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన డీకే శివకుమార్కి ఊహించని ఎదురుదెబ్బ తాకింది. ఆయన అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
Manipur Violence: మణిపూర్ రాష్ట్రం గత నాలుగు నెలలుగా అల్లకల్లోలంగా ఉంది. మైయిటీ, కుకీ తెగల మధ్య వివాదం కారణంగా ఆ రాష్ట్రంలో 175 మంది పైగా మరణించారు. వేల సంఖ్యలో సొంత గ్రామాలను వదిలి వలసపోయారు. అయితే ఈ అల్లర్లలో కుట్ర దాగి ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్, మయన్మార్ లోని కొన్ని ఉగ్రసంస్థలతో సంబంధం పెట్టుకున్న కొందరు మణిపూర్ వాసులు అల్లర్లు మరింత పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు.
Tara Shahdeo: జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ ‘లవ్ జిహాద్’ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బలవంతపు మతమార్పిడి, ముస్లిం వ్యక్తి అయి ఉండీ హిందువుగా నటించి తారా సహదేవ్ ని పెళ్లాలడం, ఆ తరువాత బలవంతంగా మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో కీలక తీర్పును వెల్లడించింది.
Manipur: మే నెలలో మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ అల్లర్లలో జూలై నెలలో అదృశ్యమైన ఇద్దరు మైయిటీ తెగకు చెందిన విద్యార్థులు దారుణంగా హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మరోసారి మణిపూర్ అగ్నిగుండంగా మారింది. ఏకంగా సీఎం బిరేన్ సింగ్ ఇంటిపైనే దాడి జరిగింది. బాధిత వర్గం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.