Manipur Violence: మణిపూర్ రాష్ట్రం గత నాలుగు నెలలుగా అల్లకల్లోలంగా ఉంది. మైయిటీ, కుకీ తెగల మధ్య వివాదం కారణంగా ఆ రాష్ట్రంలో 175 మంది పైగా మరణించారు. వేల సంఖ్యలో సొంత గ్రామాలను వదిలి వలసపోయారు. అయితే ఈ అల్లర్లలో కుట్ర దాగి ఉందని తెలుస్తోంది. బంగ్లాదేశ్, మయన్మార్ లోని కొన్ని ఉగ్రసంస్థలతో సంబంధం పెట్టుకున్న కొందరు మణిపూర్ వాసులు అల్లర్లు మరింత పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఇద్దరు మైయిటీ విద్యార్థుల హత్య ఆ రాష్ట్రం మరోసారి అగ్నిగుండంగా మారేందుకు కారణమైంది. ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా ఉన్న 22 యువకుడిని సీబీఐ పూణేలో అరెస్ట్ చేసినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం బుధవారం పూణే నుండి పౌలున్‌మాంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు గౌహతికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.
ప్రత్యేక కోర్టు అతన్ని అక్టోబర్ 16 వరకు సీబీఐ కస్టడీకి పంపింది. ఈ కేసులో పావోలున్‌మాంగ్ ప్రధాన సూత్రధారి అని సీబీఐ అనుమానిస్తోంది.
Read Also: Putin: గాజాపై ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్స్ భారీ పౌర నష్టాన్ని తెస్తుంది..
అంతకుముందు ఈ హత్యతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని అక్టోబర్ 1న చూరచంద్ పూర్ ప్రాంతంలో సైన్యం, మణిపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. పట్లుబడిన వారిలో ఇద్దరు పురుషులు పావోయిన్‌లున్ హీకిప్, స్మాల్‌సామ్ హకిప్‌లతో పాటు ఇద్దరు మహిళలు లింగ్‌నీ చాంగ్ బైటెకుకి, టిన్నెల్ హింగ్ హెన్‌తాంగ్ ఉన్నారు.
ఫిజామ్ హేమంజిత్(20) ఏళ్ల యువకుడిని, 17 ఏళ్ల హిజామ్ లింతోంగంబి అనే అమ్మాయి హత్యకు గురయ్యారు. జూలైలో తప్పిపోయిన వీరిని చంపిన ఫోటోలు సెప్టెంబర్ 26న సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసులో వీరిద్దరి మృతదేహాలు లభ్యం కాలేదు. హత్యకు ముందు మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.