JD Lakshmi Narayana: వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI EX JD Lakshminarayana Tweet Goes Viral: తాజాగా శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే. తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లగా.. అక్కడే పర్యటిస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని కలిశారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేను సీబీఐ మాజీ జేడీ ఆహ్వానించారు. అదే సమయంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రోగ్రాం జరుగుతుండగా అందులో పాల్గొన్న జేడీ.. సీఎం వైఎస్ జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు.
నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని, అంగన్వాడీలలో చిన్న పిల్లలకు పౌష్టికాహారం రాగిజావ ఇవ్వడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో.. వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందన్నారు. ఏపీ సీఎంను వివిధ కేసులలో అరెస్టు చేసిన సీబీఐ మాజీ జేడీ… అదే జగన్ పరిపాలనను అభినందించడం పట్ల సర్వత్రా చర్చగా మారింది.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈరోజు ఉదయం ఎక్స్‌లో సీబీఐ మాజీ జేడీ క్లారిటీ ఇచ్చారు. వైసీపీలో చేరుతున్నానే ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని, ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే తన పోరుబాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ద్వారా వైసీపీలో చేరడం లేదని సీబీఐ మాజీ జేడీ స్పష్టం చేశారు.
Also Read: Kuldeep Yadav Ball: కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ బాల్.. బిత్తరపోయిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్
‘శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశాను. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదు. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నా. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే నా పోరుబాటకు కట్టుబడి ఉన్నా’ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎక్స్‌లో పేర్కొన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి గారిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశాను. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను…
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) October 30, 2023
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!