చంద్రబాబు, అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, అమిత్ షాను ఎవరైనా కలవచ్చని తెలిపారు. పొత్తులు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు.
Manipur Violence: గత నెల రోజులుగా జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా శుక్రవారం అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు.
పశ్చిమబెంగాల్లో జరిగిన టీచర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించిన కేసులో జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.
కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ర్ట శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్ది. కర్ణాటక గెలుపులో డీకేతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పాత్ర కూడా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలోని మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు బెయిల్ నిరాకరించింది.