ICICI Bank Loan Fraud : దేశంలో చాలా చర్చనీయాంశంగా మారుతున్న ఐసిఐసిఐ బ్యాంక్-వీడియోకాన్ రుణ మోసం కేసులో పెద్ద అప్డేట్ వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి ఈ వ్యవహారంలో బాంబే హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీతో పాటు విజయ్ మాల్యాలను భారత్కు తీసుకురావడానికి భారత దర్యాప్తు సంస్థలు సిద్ధమయ్యాయి.
DK Shivakumar Case: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఏజెన్సీ నుంచి ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
Mohalla Clinics: ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీఎం అరవింద్ కేజ్రీవాల్కి కొత్త చిక్కు ఎదురైంది. ఆప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్ల పనితీరులో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్లలో జరిగి రోగనిర్ధారణ పరీక్షల్లో అవినీతి జరిగిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని కేంద్రం కోరినట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి.
కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు సీబీఐ మాజీ జేడీ.. అంతేకాదు.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు దరఖాస్తు చేసుకోవడం.. పార్టీ పేరు కూడా ఖరారు అయ్యిందని.. ఇక ప్రకటనే మిగిలింది అంటున్నారు..
Vishal appearing before CBI in CBFC Case: కోలీవుడ్ స్టార్, హీరో విశాల్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా హిందీ సెన్సార్ సమయంలో తన దగ్గర లంచం అడిగినట్టు ఆయన ఆరోపించారు. నేను చేసిన సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కి రూ. 6.5 లక్షలు…
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుంది టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకున్నట్లు వెల్లడైంది. దీనిపై ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. మహువాను లోక్సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలతోఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.