బాలాసోర్ రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిపై ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు వారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది.
దాణా కుంభకోణం కేసులో వైద్య కారణాలతో బెయిల్ పొందిన ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారని, బీహార్ మాజీ ముఖ్యమంత్రికి మంజూరైన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో జగదీష్ టైట్లర్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోని ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. కాంగ్రెస్ నాయకుడు గుంపును ప్రేరేపించి, మైదానంలో అల్లర్లకు నాయకత్వం వహించారని దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరోపించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడివిడిగా విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణమని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక అని అన్నారు.
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ రూ.100 కోట్లు ఖర్చు చేసిందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై కేంద్ర సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు.. ఈ విషయంలో బీజేపీకి నోటీసులు జారీ చేస్తారా? విచారణ జరిపిస్తారా?.. ప్రధాన మంత్రి మోడీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది-మంత్రి కేటీఆర్
250 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ రైలు దుర్ఘటనకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసింది.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్తో పాటు ఆయన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై ఉద్యోగాల కుంభకోణంలో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.