దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు విలవిలలాడాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఫలితంగా సెన్సెక్స్ 709 పాయింట్ల భారీ నష్టంతో 51,822 వద్ద ముగియగా నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 15,413 వద్ద స్థిరపడింది. గత రెండు రోజులు లాభాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ముచ్చటగా మూడోరోజు అలాంటి లాభాలను చవిచూడలేక చతికిలపడ్డాయి.
నిఫ్టీ 50లో ఐదు కంపెనీలు లాభాల్లో ముగియగా.. మిగతా 45 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, టీసీఎస్, మారుతి సుజుకి, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు స్వల్పంగా లాభాలు ఆర్జించాయి. హిందాల్కో, టాటా స్టీల్, విప్రో, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగతా ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, రియాల్టీ, బ్యాంక్, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ 1-2 శాతం వరకు నష్టాలు చవిచూశాయి. కాగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.34 వద్ద ట్రేడవుతోంది.
SBI Annuity Scheme : అదిరిందిగా.. ఎస్బీఐ నుంచి నెలవారి ఆదాయం..