దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో గత నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరిలో మొత్తం 1,33,026 కోట్ల వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 18 శాతం అధికంగా రూ.1.33 లక్షల కోట్ల రాబడి వచ్చింది. ఒక నెలలో రూ.1.30 లక్ష కోట్ల మార్కు దాటడం జీఎస్టీ చరిత్రలో ఇది ఐదోసారి. మొత్తం నమోదైన వసూళ్లలో సీజీఎస్టీ ద్వారా రూ.24,435 కోట్లు, ఎస్జీఎస్టీ ద్వారా రూ.30,779…
అమూల్ సంస్థ పాల ధరలను మరోసారి పెంచింది. తన అన్ని రకాల పాల ధరలను పెంచుతున్నామని సోమవారం ప్రకటించింది. లీటర్ పాలపై రూ.4 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపింది. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. మరోవైపు అమూల్ తాజా…
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే బీరు తయారీలోకి వినియోగించే ప్రధాన ముడి పదార్థం బార్లీ ఉత్పత్తిలో రష్యా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. బీర్ తయారీకి మరొక ముడి పదార్థం మాల్ట్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆగకుండా ఇలాగే మరికొంత కాలం జరిగితే బార్లీ కొరత ఏర్పడనుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బార్లీ…
ఐక్కా(IKEA) స్వీడిష్ గృహోపకరణాల రిటైలర్, సుసానే పుల్వెరర్‌ను తన భారతదేశ వ్యాపారం కోసం దాని కొత్త మరియు మొదటి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మరియు చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ (CSO)గా నియమించింది. సుసానే అవుట్గోయింగ్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఐక్కా ఇండియాలోని సుసానే పుల్వెరర్ ఇంగ్కా గ్రూప్‌లో ఇంతకుముందు గ్రూప్ బిజినెస్ రిస్క్ మరియు కంప్లయన్స్ మేనేజర్‌గా పనిచేశారు. సుసానే 1997లో ఐక్కాలో చేరారు. ఐక్కాలో సుసానే విభిన్న…
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయి. గురువారం ఉదయం రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై ముప్పేట దాడి చేసింది. దీంతో అంతర్జాతీయంగా పలు దేశాల్లోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇండియాలో అయితే మార్కెట్లు మొదలైన అరగంటలోనే బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు తగ్గింది. షేర్ హోల్డర్లు భయంతో షేర్లను అమ్మేస్తుండటంతో…
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలను బట్టే పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తుంటారు. కానీ ఓ వైపు ముడి చమురు ధరలు పెరుగుతున్నా.. దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం లేదు. దీనికి కారణంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటమే. గత ఏడాది నవంబర్ 4 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాటే లేదు. ఈ కాలంలో బ్యారెల్ ముడి చమురు ధర 14 డాలర్లు…
ప్రస్తుతం వాట్సాప్ వాడని స్మార్ట్ ఫోన్ అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. మొబైల్‌తో పాటు డెస్క్ టాప్ యూజర్లు కూడా వాట్సాప్ వాడుతుంటారు. అయితే ఇన్నాళ్లూ మొబైల్ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కొందరు ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అప్డేట్ చేసింది. అతి త్వరలో వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. Read Also: Golden Visa: గోల్డెన్…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ పుణేలో కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్ళు. గత కొద్ది రోజులుగా ఆయన న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. దీంతో ఆయన ఇవాళ మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. 40…
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ట్విట్టర్లో ట్వీట్లు చేయడానికి యూజర్లు నానా అవస్థలు పడ్డారు. మొబైల్ మాత్రమే కాదు వెబ్సైట్లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని యూజర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే లాగౌట్ అయిందని పలువురు వాపోయారు. ట్విట్టర్…
రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఊరట కలిగించింది. ఆర్బీఐ వరుసగా పదోసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ గురువారం నాడు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా వద్దనే ఉంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25…