Credit Cards Usage: ఒక్క నెలలో రూ.లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డు లావాదేవీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో క్రెడిట్ కార్డులను బీభత్సంగా వాడేస్తున్నారు. దీంతో ఒక్కనెలలోనే రూ.లక్ష కోట్లకు పైగా క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిగాయి. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడ్డాయని చెప్పేందుకు ఈ గణాంకాలు ఉదాహరణ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్‌బీఐ) అభిప్రాయపడింది. మే నెలలో దేశంలో రూ.1.25 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు లావాదేవీలను యూజర్లు నిర్వహించారని ఆర్‌బీఐ వెల్లడించింది. మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల కోసం రూ.71,429 కోట్లు చెల్లింపులు చేశారని తెలిపింది. అటు పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద రూ.42,266 కోట్ల లావాదేవీలు జరిపినట్లు వివరించింది. దీంతో ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లోనే క్రెడిట్ కార్డులు వాడేందుకు వినియోగదారులు మక్కువ చూపుతున్నారని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.
Read Also: Social Media: సోషల్ మీడియానే నమ్ముకున్న భారతీయులు.. అవే నిజమని నమ్మేస్తున్నారు..!
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
ఏప్రిల్ నెలలో మాత్రం క్రెడిట్ కార్డు కస్టమర్లు ఆన్‌లైన్‌లో రూ.65,652 కోట్ల చెల్లింపులు చేయగా.. పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ల వద్ద రూ.39,806 కోట్ల లావాదేవీలు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. సంఖ్యాపరంగా అత్యధిక క్రెడిట్ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ 1.72 కోట్లతో ముందంజలో ఉంది. మే నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.41 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 1.33 కోట్ల క్రెడిట్ కార్డులను వినియోగదారులకు జారీ చేశాయి. మరోవైపు డెబిట్ కార్డుల ద్వారా ఏప్రిల్ నెలలో వినియోగదారులు ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్‌ల వద్ద రూ.65,957 కోట్ల లావాదేవీలు జరిపారు. మే నెలలో డెబిట్ కార్డులతో పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్‌ల ద్వారా రూ.44,305 కోట్లు, ఈ–కామర్స్ కోసం రూ.21,104 కోట్లను వినియోగదారులు ఖర్చు చేశారు.
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!