Stock Market: వరుసగా మూడోరోజూ నష్టాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా మూడవరోజూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాటు, మరో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ పతనంతో ముందుకు నడిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు కోల్పోయింది. 52,693కి సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది.
భారతి ఎయిర్ టెల్, ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాభాల్లో నడిచాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ , మారుతి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నష్టాలు చవిచూశాయి. ఇదిలా వుంటే దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్ పై దిగుమతి భారం పడుతోంది. మే 21న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించగా అప్పటి నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే వ్యాట్ తగ్గించాయి.
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82గా ఉంది. విజయవాడలో పెట్రోల్ లీటరు రూ.111.81 గా వుంది. అలాగే, డీజిల్ లీటరు రూ. రూ.99.56గా వుంది, విశాఖపట్నంలో మాత్రం పెట్రోల్ ధర 80పైసలు తగ్గింది. అక్కడ లీటరు ధర రూ.110.48 గా ఉంది. డీజిల్ పై 74 పైసలు తగ్గి లీటరు రూ.98.27గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్నాటకల్లో చమురుధరలు తక్కువగా వున్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ రూ. 94.24 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 101.94 కాగా, డీజిల్ రూ. 87.89గా వుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!