ప్రస్తుతం దేశంలోని పలు టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియో మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వార్ నడుస్తోంది. జియో దెబ్బతో ఎయిర్‌టెల్ కూడా రీ ఛార్జ్ ప్లాన్‌లను తక్కువ ధరకే అందిస్తుందని యూజర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే నెట్‌వర్క్ పరంగా ఏది బెస్ట్ అయితే కస్టమర్లు దానినే ఎంచుకుంటున్నారు. ఎయిర్‌టెల్ నుంచి పోటీ ఉండటంతో జియో కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఒకప్పుడు మొబైల్ యూజర్లు 20 MB డేటా కోసం రీఛార్జ్ చేసుకోవడానికే అత్యధికంగా ఖర్చు చేసేవాళ్లు. కానీ నేడు చాలా తక్కువ ఖర్చుతో ప్రతిరోజూ 1 జీబీ కంటే ఎక్కువ డేటా వాడే పరిస్థితులు నెలకొన్నాయి.
సాధారణంగా టెలికాం కంపెనీలు ప్రస్తుతం అందిస్తున్న అనేక ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. నెల తిరగకముందే రెండు సార్లు రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో జియో తాజాగా తన కస్టమర్ల కోసం 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.259 రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు 30 రోజులు లేదా 31 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చని జియో తెలిపింది. ఈ ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు ప్రతిరోజూ 1.5GB డేటా లభిస్తుంది. ఈ డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. రోజూ ఉచితంగా 100 SMSలు పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా జియో యాప్‌ల కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.