టెక్నాలజీ రోజూ కొత్త పుంతలు తొక్కుతూ మానవుడి జీవినశైలిలో భాగమైపోయింది. ప్రపంచం లేటెస్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూనే ఉంది. టెక్నాలజీ రంగంలో అర్థమయ్యికానీ.. కొన్ని విషయాల్లో క్రిప్టో కరెన్సీ ఒకటి. అయితే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టి కోట్ల ఘడించాలనుకొని బొక్కబోర్లా పడుతున్నారు. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించాలని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోసపోతున్నారు. అయితే అందులో భారతీయులు కూడా ఉన్నారు. అయితే నకిలీ క్రిప్టోకరెన్సీ ఎక్చేంజీలు ద్వారా భారతీయ పెట్టుబడిదారులు సుమారు 128 మిలియన్లకు పైగా (దాదాపు రూ. 1,000 కోట్లు) వరకు మోసపోయారని మంగళవారం ఒక కొత్త నివేదిక పేర్కొంది. అనేక ఫిషింగ్ డొమైన్‌లు, ఆండ్రాయిడ్ ఆధారిత నకిలీ క్రిప్టో అప్లికేషన్‌లతో కూడిన, కొనసాగుతున్న ఆపరేషన్‌ను కనుగొన్నట్లు సైబర్-సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ సెక్ (CloudSEK) తెలిపింది.
“ఈ నకిలీ వెబ్‌సైట్‌లలో చాలా వరకు UK-ఆధారిత క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన “CoinEgg” వలె పోలి ఉంటాయి” అని నివేదిక పేర్కొంది. అటువంటి క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో డిపాజిట్ మొత్తం, పన్ను మొదలైన ఇతర ఖర్చులతో పాటుగా రూ. 50 లక్షలు ($64,000) పోగొట్టుకున్న బాధితుడు క్లౌడ్‌సెక్‌ని సంప్రదించాడు. అయితే దీనిపై “అటువంటి క్రిప్టో స్కామ్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితులను $128 మిలియన్ (సుమారు రూ. 1,000 కోట్లు) మోసగించారని మేము అంచనా వేస్తున్నాము” అని క్లౌడ్‌సెక్ వ్యవస్థాపకుడు మరియు సీఈవో అయిన రాహుల్ శశి అన్నారు. పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లపై ఆసక్తి పెంచుకుంటున్న తరుణంలో.. స్కామర్‌లు, మోసగాళ్లు తమ దృష్టిని వారివైపు మళ్లిస్తారు’ అని శశి తెలిపారు.