మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్మెన్ రంగన్న మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రంగన్న మృతి గల కారణాలను సమగ్రంగా విచారించడం కోసం కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడో మరోసారి తెరపైకి వచ్చింది.. ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామన్న ఆమె.. సాక్షుల వరుస మరణాల అంశంపై కేబినెట్లో చర్చించాం సమగ్ర దర్యాప్తు జరపాలని అదేశించాం అన్నారు..
2024 ఎన్నికలలో కూటమి సునామీని తట్టుకుని నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చంద్రశేఖర్... ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు. ఆ విధంగా అధికార పార్టీ నేతలకు టార్గెట్ అవుతున్నారట. అదే సమయంలో నియోజకవర్గంలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత కూడా యర్రగొండపాలెం ఎమ్మెల్యేకి పొగబెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికార పార్టీ నుంచి ఉండే వత్తిడి సహజమే..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి లో పౌర సేవలు మరింత ఈజీ అవడం కావడం కోసం ఉద్యోగుల ప్రమోషన్ చానెల్స్ లో మార్పుకోసం చేసింది ప్రభుత్వం. దీనికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..ఇక నుంచి సింగిల్ కేడర్ గానే ఎంపీడీఓ డీఎల్పీఓలను మార్చారు. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఎంపీడీఓల రిక్రూట్మెంట్ ను రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతి ఇప్పుడు చర్చగా మారింది.. ఇవాళ ఏకంగా ఏపీ కేబినెట్ భేటీలోనూ ఈ వ్యవహారం చర్చకు వచ్చింది.. ఇప్పటివరకు వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులుగా, నిందితులుగా ఉన్నవారిలో నలుగురు చనిపోవడంపై డీజీపీ వివరణ కోరింది కేబినెట్.. అయితే, ఒక్కో మరణం గురుంచి కేబినెట్ కు వివరించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. దీంతో, ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, పూర్తి…
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ ఇచ్చింది నరసరావుపేట కోర్టు.. పోసానిని ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి.. పోసానిని రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నరసరావుపేట కోర్టు ఆదేశాలు జారీ చేసింది..