శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.. నాగబాబు పేరు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మరోవైపు సినీ నటుల కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరుస ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వివిధ కేంద్ర పథకాల కింద సహాయం చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది..
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం వినిపించండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
కేంద్ర ప్రభుత్వంగా కాదు.. మా బాధ్యతగా ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందిస్తున్నాం అన్నారు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరవాత దేశ వ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నాం. మొదట ముంబైలో.. రెండో చర్చ విశాఖ లో నిర్వహించాం అన్నారు.. విశాఖలో బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలను కలసి వారి సలహాలు, సూచనలు తీసుకున్నాం అన్నారు..
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈరోజు విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసుల అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టంచేశారు. పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో, బాధితురాలి పేర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు ప్రస్తావించారు అన్నారు. ఈ అంశంపై తాను అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని…
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పేరును ఖరారు చేశారు.. అయితే, బీజేపీకి ఈ సారి డౌటే అనే చర్చ సాగుతోంది.. మిగిలిన నాలుగు స్థానాల్లో.. టీడీపీ నుంచి ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది..
సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించారు.. తనపై వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో నమోదైన కేసులను క్వాష్ చేశాయంటూ పిటిషన్ వేశారు.. అయితే, పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ల మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..