కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి ముగిసేసరికి మరొకటిగా పెరుగుతున్న వివాదాలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు కూడా బలి పశువులు అవుతున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేది ఒక పార్టీ, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానిది మరో పార్టీ కావడంతో.... వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మాకు శాపంగా మారాయని అంటున్నారు సిబ్బంది. ఒకరు పని చేయమంటే మరొకరు వద్దంటున్నారని, ఎవరి మాట వినాలో తెలియక గందరగోళంలో ఉన్నామని అంటున్నారట.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో సీనియర్స్‌కి కొదవేం లేదు. అదే... ఎక్కడికక్కడ ఆధిపత్య పోరుకు బీజం వేసిందన్నది పార్టీ నేతల మాట. వీరిని కట్టడం చేసేందుకు గతంలో ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలు ప్రయత్నించేవారు. అభిప్రాయ తమ అనుభవాన్ని, పొలిటికల్ సీనియారిటీని ఉపయోగించి వేదికల మీద జరిగే గొడవల్ని నాలుగు గోడల మధ్యకు తీసుకురాగలిగేవారు.
పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి జనసేన ఆవిర్భావ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత జరిగే సభ కావడంతో చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అన్నారు.. రెండు రాష్ట్రాల నుంచి జనసేన ప్రతినిధులు హాజరవుతారు.. జనసేన సిద్ధాంతాలు జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈ ఆవిర్భావ సభ ఉద్దేశని వెల్లడించారు..
ప్రజల భద్రత మరింత పెంచేందుకు ఏలూరు పోలీసుల వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రోడ్లపై ఇష్టానుసారం పార్కింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వారిపై, నిర్మాణస్య ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే దొంగలపై మాత్రమే కాదు ఊరేగింపులు, వేడుకల వద్ద అల్లర్లకు పాల్పడే ఆకతాయిలను గుర్తించేందుకు డ్రోన్ల సాయంతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.
కడప వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుచేత రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు.. పులివెందుల ఆర్డీవో సమక్షంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికి తీసి శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై క్షుణ్ణంగా వైద్య బృందం పరిశీలించారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై స్పందిస్తూ.. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరు.. కానీ, రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట.. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కేబినెట్ లో ప్రజలకు చేయాల్సిన…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన "శక్తి" యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన 'శక్తి' యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం.