YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వేకు సంబంధించిన క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా?అంటూ ప్రశ్నించారు. భూముల రీ సర్వే కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించామని.. అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన…
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు డివైడర్ దాటి అవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సిరువెళ్ల మెట్ట పై ARBCVR ట్రావెల్స్ బస్సు, లారీ దగ్ధం అయ్యాయి. బస్సు, లారీ మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మంటల్లో మృతి, బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి చెందాడు. పలువురికి గాయాలు అయ్యాయి. మంటలు…
లిక్కర్ కేసులో ఆ ముగ్గురికి బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సుప్రీంకోర్టు పెద్ద ఊరట కల్పించింది. వీరి అరెస్టు నుంచి ఇప్పటివరకు ఉన్న రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే, ఈ ముగ్గురు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులో…
మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు.. స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా మూడో రోజూ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే ప్రత్యేక సెషన్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో…
* ఇవాళ్టి నుంచి భారత్, న్యూజిలాండ్ టీ-20 సిరీస్.. ఇవాళ రాత్రి 7 గంటలకు నాగ్పూర్ వేదికగా తొలి మ్యాచ్.. భారత్-న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ-20 సిరీస్ * నేటి నుంచి జేఈఈ మెయిన్స్.. రికార్డు స్థాయిలో 14.50 లక్షల మంది దరఖాస్తు.. * మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. ఇవాళ మండమెలిగే పండుగకు ఏర్పాట్లు.. మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఈ నెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ స్పెషల్…
CM Switzerland visit: స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు భారత రాయబారి మృదుల్ కుమార్ తో జ్యూరిచ్లో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ కంపెనీలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. Renu Desai: నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు.. ట్రోలర్స్, యూట్యూబ్ ఛానళ్లపై ఆగ్రహం..! ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో…
వీడియో వైరల్.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు.. అనకాపల్లిజిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్ సూర్యచంద్రకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పార్టీ ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని., భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక వీడియో వెలుగులోకి రాగా.. వైరల్ గా మారింది. వివాహం కోసం వైవాహిక బంధాన్ని…
పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి పోటీపడి 19 బీర్లు తాగిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలం బండ వడ్డీపల్లిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది.. అతిగా మద్యం సేవించడమే మృతికి కారణమని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ…