Andhra Pradesh: ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హత నిర్ధారణ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖ రాశారు.. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అర్హత నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కు అనుగుణంగా రాష్ట్రంలో కుడా నిర్ణయం తీసుకోవాలని సీఎంను లేఖలో కోరారు.. క్రిమీ లేయర్ ఓబీసీ రిజర్వేషన్ లకు సంబంధించిన అంశం.. ఓబీసీల వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా ఎక్కువగా ఉండడంతో పాటు 40 ఏళ్ల లోపు ఉద్యోగం ఉన్న గ్రూప్ A అధికారుల పిల్లలు క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారు. క్రిమీ లేయర్ వర్తిస్తే వారు సామాజికంగా బాగా అభివృద్ధి దిశలో ఉన్నట్టుగా పరిగణించి ఎలాంటి రిజర్వేషన్లు అమలు కావు. కల్నల్ లేదా ఇతర హోదాలో ఉన్నవారి పిల్లలకు కూడా ఈ రిజర్వేషన్లు ఉండవు. 8 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు నాన్ క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల వర్గీకరణను వేతన శ్రేణుల ఆధారంగా ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ అర్హతను నిర్ధారించడానికి సరైన ప్రాతిపదిక ఉండాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. ఇతర బీసీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించాల్సిన అవసరాన్ని లేఖలో పేర్కొన్నారు.. టీడీపీ బీసీ శాసనసభ్యులు, ప్రస్తుత రాష్ట్ర వర్గీకరణ వ్యవస్థ స్థిరంగా లేకపోవడంతో ఓబీసీ రిజర్వేషన్ల అర్హతను నిర్ధారించడంలో అస్పష్టత, సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు..
Read Also: MP Eatala Rajender: మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం నిధులు కేటాయించాలి..
DoPT గైడ్ లెన్స్ ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-A/గ్రూప్-B) అధికారులు నిర్దిష్ట షరతులకు లోబడి క్రిమీ లేయర్ విభాగంలో ఉన్నారన్నారు. దానికి భిన్నంగా రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలను స్టేట్ సర్వీసెస్, సబ్ ఆర్డినేట్ లుగా మాత్రమే వర్గీకరించారని లేఖలో వివరించారు.. దీంతో ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ అర్హతను నిర్ణయించడంలో కీలకమైన గ్రూప్-A మరియు గ్రూప్-B విభాగాల మధ్య తేడాను ప్రస్తావించలేదన్నారు. ఈ స్పష్టమైన వర్గీకరణ లేకపోవడం వల్ల ముఖ్యంగా రెవెన్యూ లాంటి శాఖల ఉద్యోగులు తమ ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ అర్హతలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎం కు లేఖలో వివరించారు.. దీనికి తోడు బీసీ వెల్ఫేర్ మెమోలో “క్లాస్” ఆధారంగా వర్గీకరణను ప్రస్తావించకపోవడం వల్ల మరింత అస్పష్టత ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేరళ కూడా వేతన శ్రేణుల ఆధారంగానే ఉద్యోగాలను వర్గీకరించిందని.. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్, 1991 లో రూల్ 5 ను సవరించాలన్నారు..
Read Also: Hyderabad: భారీగా కుళ్లిన మేక, గొర్రె మాంసం స్వాధీనం.. ఇక హలీమ్, బిర్యానీలు తిన్నట్లే!
కేంద్ర ప్రభుత్వం, కేరళ తరహాలోనే ఏపీలోనూ అదే విధానం అమలు చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే విధానం అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ లేఖ లో కోరారు. ఈ నేపథ్యంలో ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ అర్హతను నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ బీసీ ఎమ్మెల్యేలు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ లేఖ లో వివరించారు.. ఇప్పటికే ఎస్సి వర్గికరణ పై ఏపి ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసింది..మరి ఈ ఓబీసీ క్రిమి లేయర్ కు సంబంధించి సీఎం చంద్రబాబు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి…