సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. పోసానికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది విజయవాడలోని సీఎంఎం కోర్టు.. ఈ రో సీఎంఎం కోర్టులో పోసానిని హాజరు పరిచారు పోలీసులు.. అయితే, తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయాధికారికి చెప్పారు పోసాని.. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు..
ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు అవుతుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఇంటరాక్షన్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నా కుటుంబంతో పాటు వ్యాపారంలో భువనేశ్వరి పాత్ర కీలకం. హెరిటేజ్ సంస్థని భువనేశ్వరి డెవలప్ చేశారని ప్రశంసలు కురిపించారు.. ఇక, నా తల్లి పడిన ఇబ్బందులు మహిళలు పడకూడదనే దీపం పథకం…
సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారు.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదంటూ కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయన్న ఆమె.. చంద్రబాబు మోసాలపై ఏపీ మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. రోజుకు 70 మంది మహిళలు,…
Home Minister Anitha: విజయనగరంలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఇక, స్త్రీ నిధీ చెక్కును మహిళలకు మంత్రి అందజేసింది.
Minister Narayana: ఎన్టీవీతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుంది.. మొదటి దశలో 40 వేలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక, ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?.
Nadendla Manohar: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల పూర్తి భద్రతకి ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో వంద శాతం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
YV Subba Reddy: యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు.. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం..
ఈరోజు, రేపు రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి కోరితే.. న్యాయవాది సమక్షంలో అతడ్ని విచారణ చేయాలంటూ పోలీసుకు న్యాయస్థానం సూచించింది.
CM Chandrababu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు (మార్చ్ 8న) మార్కాపురం వెళ్లనున్నారు. ఇక, 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని తొలుత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం 11.15 గంటల వరకు అధికారులతో భేటీ కానున్నారు.