Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. కర్నూలు జిల్లా పర్యటనకు రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడంతో పవన్ కల్యాణ్ పర్యటన ముగియనుంది.. రేపు ఉదయం 9.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్ కల్యాణ్.. ఇక, కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి పూడిచెర్ల చేరుకోనున్నారు పవన్.. పూడిచెర్లలో ఫారంపాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Hyderabad: భారీగా కుళ్లిన మేక, గొర్రె మాంసం స్వాధీనం.. ఇక హలీమ్, బిర్యానీలు తిన్నట్లే!
ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రైతు సూర రాజన్న పొలంలో ఫారం పాండ్‌కు భూమి పూజ చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.. ఇక, పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని గురువారం రోజు కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, భద్రత గురించి ఎస్పీతో చర్చించారు. సుమారు సభకు 4వేల మంది వరకు హాజరు కానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, పూడిచర్లలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కర్నూలు ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..