ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. అజెండాలోని 14 అంశాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గ సమావేశం.. ముఖ్యంగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్లో మార్పు చేర్పుల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 12వ తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ఇక, అదే రోజు వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి సూచించారు..
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట దక్కింది.. పోసానికి కడప మొబైల్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోసానిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో గత నెల 24వ తేదీన కేసు నమోదు అయిన విషయం విదితమే కాగా.. ఈ…
నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి.. తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో ఈ రోజు పర్యటించిన ఆమె.. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అని వ్యాఖ్యానించారు..
వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాం అన్నారు ఎస్పీ అశోక్ కుమార్.. వివేకా హత్య కేసులో ఒక్కొక్కరుగా సాక్షులు మృత్యువాత పడుతున్నారు... వివేకా హత్య కేసులో వరుసగా నలుగురు సాక్షులు చనిపోయారు... అందుకోసం రంగన్న మృతిని అనుమానస్పద కేసుగా నమోదు చేశాం... రంగన్న మృతిపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నాం...
వైసీపీ హయాంలో తమ నియోజకవర్గాల్లో హవా కొనసాగించిన ఆ ఎమ్మెల్యేలు.. మాజీలు కాగానే.. సీన్ మొత్తం మారిపోయింది. అసలు వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన వారి సంగతి ఒక ఎత్తైతే.. రాయలసీమలో బాబాయ్- అబ్బాయిల పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాబాయ్కాగా.. అబ్బాయ్ ధర్మవరం మాజీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఐదు స్థానాలకు గాను...ఒకటి కన్ఫామ్ అయిపోయింది. జనసేన తరపున నాగబాబుని ఇప్పటికే ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీకి మూడు వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా ? వద్దా ? అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది. మూడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.. నాగబాబు పేరు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు.