Srisailam Temple: ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం.. ఉగాది మహోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.. ఉగాది మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాల కంటే కన్నడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.. అది కూడా పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు.. అయితే, ఉగాది ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చే కైలాశద్వారం వద్ద భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు ఈవో శ్రీనివాసరావు.. కన్నడ భక్తులు సేదతిరే చలువ పందిళ్లు, స్వచ్ఛసేవ, అన్నదానలను పరిశీలించారు ఈవో.. మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. పాదయాత్ర కన్నడ భక్తులకు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు..
Read Also: Robinhood: #Grok ముహూర్తం కలిసి రాలేదు.. రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ వాయిదా!
కైలాసద్వారం-భీముని కొలను మార్గంలో 6 చోట్ల తాత్కాలికంగా 1000 లీటర్ల సింటెక్స్ ఏర్పాటు చేసింది శ్రీశైల దేవస్థానం.. కైలాసద్వారం వద్ద 5 వేల లీటర్ల 8 సింటెక్స్ ట్యాంకులు అదనంగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈవో శ్రీనివాసరావు.. పరిశీలనలో భాగంగా పాదయాత్ర భక్తులను దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఆడిగి తెలుసుకున్నారు ఈవో.. కాగా, శివరాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక భక్తులు శ్రీశైలానికి తరలివస్తుంటారు.. అయితే, ఉగాది మహోత్సవాలకు మాత్రం కన్నడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.. దీంతో, శ్రీశైలం భక్తజన సంద్రంగా మారిపోతోంది..