Minister Narayana: విశాఖపట్నం అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ప్రజల అభిప్రాయం తర్వాత మాత్రమే వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుందన్నారు మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం స్వార్ధ పూరితంగా ఆలోచించి వైజాగ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని విమర్శించారు.. వైజాగ్ మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి, భూ సమస్యలుపై విశాఖ ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. విశాఖకు ఉన్న ప్రాధాన్యత భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.. ఇందులో భాగంగా వైజాగ్ మాస్టర్ ప్లాన్. .ట్రాఫిక్ సమస్యలు, మెట్రో రైల్.. ఇలా అన్ని విషయాలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.. జీవీఎంసీ పరిధిలో ప్రజాప్రతినిధులు ఈ సమీక్షకు హాజరయ్యారు.. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.. వైజాగ్ మాస్టర్ ప్లాన్ లో మార్పులు తప్పని సరిగా చేయాలని.. ప్రజాప్రతినిధులు నారాయణకు తెలిపారు.. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతనే మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు.
Read Also: Gautam Gambhir: ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లిన టీమిండియా హెడ్ కోచ్..
నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి అవుతుంది అన్నారు మంత్రి నారాయణ.. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నారు.. వైజాగ్ లో 30 ఏళ్ల భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తామన్నారు.. ఆన్ లైన్ లో మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఇక, టీడీఆర్ బాండ్ల సమస్య కూడా త్వరలో పరిష్కారం అవుతుందన్నారు మంత్రి నారాయణ.. అదే విధంగా వైజాగ్ ట్రాఫిక్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను దృష్టిలో పెట్టుకుని వైజాగ్ లో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ..