Posani Krishna Murali Case: సినీ నటుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళికి సీఐడీ కేసులో తాజాగా బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు.. అయితే, బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా పలు షరతులు విధించింది.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది సీఐడీ.. అయితే, ఈ కేసులో ఈ రోజు బెయిల్‌మంజూరు చేసిన కోర్టు.. లక్ష రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది.. ఇక, వారానికి రెండు రోజులు సీఐడీ రీజనల్ ఆఫీసుకి వచ్చి సంతకాలు చేయాలని షరతులు విధించింది.. విచారణకు పూర్తిగా సహకరించాలి.. ఈ సమయంలో దేశం విడిచి వెళ్లకూడదు.. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదు.. పత్రికల్లో ఎటువంటి ప్రకటనకు చేయకూడదు అని గుంటూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది..
Read Also: Watermelon: పుచ్చకాయను డైరెక్ట్ గా తినడం మంచిదా లేక జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా?
అయితే, గుంటూరు సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ వచ్చినా.. జైలు నుండి విడుదలకు మోక్షం కలగడం లేదు.. ఈ రోజు బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో జైలు నుండి పోసాని కృష్ణ మురళి విడుదల కాలేకపోయారు.. రేపు విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు.. మరోవైపు, బెయిల్ వచ్చినా పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే వరకు అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు.. ఏ క్షణంలో పీటీ వారెంట్‌తో.. ఏ స్టేషన్ పోలీసులు వస్తారో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కానీ, ప్రస్తుతానికి ఎలాంటి కేసులు లేవని చెబుతున్నారు న్యాయవాదులు.. కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై వివిధ ప్రాంతాల్లో మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి.. అయితే, ఇప్పటికే కొన్ని కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయినా.. మరికొన్ని కేసుల్లో రిమాండ్‌లో ఉండడం.. అన్ని కేసులో బెయిట్ దక్కకపోడం.. మరికొన్ని కేసుల్లో 35 (3) Bns ఫాలో అవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. పోసాని జైళ్లలోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే రేపు గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల అవుతారని చెబుతున్నారు. మొత్తంగా రేపు ఉదయమే పోసానిని విడుదల చేయించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన తరఫు న్యాయవాదులు..