Tirumala Rush: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. అయితే, నిన్న (మార్చ్ 21) శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకోగా.. 26, 821 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.
Read Also: (no title)
అయితే, శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాలినడకన భక్తులు తిరుమలకు పోటెత్తారు. టైం స్లాట్ టోకెన్లు తీసి వేస్తామని భక్తులను దోచేస్తున్న కొందరు ఆటోవాలాలు.. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, టీటీడీ వసతి సముదాయాల నుంచి ఆటోలలో భక్తుల తరలింపు.. రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్న భక్తులకు టైం స్లాట్ టోకెన్లు లభించని పరిస్థితి ఏర్పడింది. ఆటోలు, కార్లు కారణంగా తిరుపతి, మదనపల్లి మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్న పోలీసులు, టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదు.