కడప జిల్లా సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ లోని లంకమల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. సిద్ధవటం రేంజ్ లో 64 ప్రాంతాలను గుర్తించి 128 అత్యాధునిక డిజిటల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మద్దూరు, కొండూరు, ముత్తుకూరు, పొన్నపల్లి, గొల్లపల్లె అటవీ ప్రాంతాలలో అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేశారు.. రాష్ట్రస్థాయి పులుల గణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పులులు ఘనన చేపడుతున్నట్లు ఫారెస్ట్ అధికారిని…
కుమారుడు మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లి వద్దకు వచ్చిన ఓ వానరం.. ఆ తల్లిని ఓదార్చింది. ఇక, తన కుమారుడే వానరం రూపంలో తన వద్దకు తిరిగి వచ్చాడని.. ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది..
సినీనటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్పై నేడు కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది.. పోసాని బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది.. మరోవైపు, పోసాని కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది కోర్టు.. గత 5 రోజులుగా కర్నూలు జైలులో రిమాండ్లో ఉన్నారు పోసాని..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.. పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో టీడీపీ మూడు, జనసేన, బీజేపీ చెరో ఒకటి ఎమ్మెల్సీ స్థానాలు తీసుకుంటున్నాయి.. ఐదు స్థానాలు అధికార కూటమికి రావడంతో వైసీపీ నుంచి పోటీ లేదు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రోత్సహించడంలో భాగంగా అభ్యర్థులు ఎంపిక జరిగింది.. ఈసారి ఎమ్మెల్సీ స్థానాలకు చాలామంది ఆశావహులు ఉన్నారు.. ఇంచుమించుగా పాతిక నుంచి…
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు అని మండిపడ్డారు.
Chelluboyina Venu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 14 లక్షలు కోట్ల అప్పులపాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. శాసన సభలో 6 లక్షల 40వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది.
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు.