Operation Garuda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాప్స్ మీద మెరుపు దాడులు జరిగాయి. 100 బృందాలతో ఈ తనిఖీలు చేపట్టారు. మందుల షాపులు, మందుల ఏజెన్సీలపై ఈ దాడులు చేశారు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో మెరుపు దాడులు కొనసాగాయి.. ఏపీలో ఉన్న 26 జిల్లాల్లో మెడికల్ షాప్స్ లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, స్థానిక పోలీసులు, డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో టీమ్ గా ఏర్పడి దాడులు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల పై దాడులు నిర్వహించారు. ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఐజీ ఆకే రవి కృష్ణ విజయవాడ లో ఉన్న శివ సాయి మెడికల్ షాప్ లో తనిఖీల్లో పాల్గొన్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మెడికల్ షాప్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదని అలాంటి మందుల అమ్మకం జరుగుతుందేమో పరిశీలించారు.. ALBENDAZOLE వంటి కొన్ని మత్తు ఇచ్చే టాబ్లెట్స్ ఇంజక్షన్స్ ను కొనుగోలు చేసి యువత బానిసలుగా మారుతున్నారనీ సమాచారం రావటంతో ఈ దాడులు జరిగాయి గంజాయిని కట్టడి చేస్తున్న నేపథ్యంలో యువత ఈవిధమైన నిబంధనలకు విరుద్ధంగా మందులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులు రావటంతో ఆకస్మిక తనిఖీలు జరిపారు ఈగల్ టీం చీఫ్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ గతంలో కంటే కట్టుదిట్టంగా ఎన్ డి పి ఎస్ యాక్ట్ ను అమలు చేస్తామన్నారు. యువత ఇలాంటి మత్తు టాబ్లెట్ లకు బానిసలు కాకుండా ఉండాలని వారికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరిపి ఇటువంటి అమ్మకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు