మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. మరోమారు విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు..
ఎన్నికల పారదర్శకతపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలను డాటాను విశ్లేషించింది. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. గత ఐదు సంవత్సరాలలో వేరే పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి.. పార్టీ మారిన 63 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా రూపొందించింది. ఎమ్మెల్యేల నేర నేపథ్యం, వారి ఆస్తుల వివరాల గురించి…
నంద్యాల..... ఏ సీజన్లోనూ పొలిటికల్ హీట్ తగ్గని జిల్లా ఇది. అందులోనూ.... ఇక్కడి టీడీపీలో అయితే... ఆ డోన్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటారు. ఈ జిల్లాలో ప్రత్యర్థి పార్టీ వైసీపీతో కంటే... తెలుగుదేశంలోని గ్రూప్‌వారే ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ పోరు బహిరంగమవుతూ.... అప్పుడప్పుడూ వీధికెక్కుతూ ఉంటుంది కూడా. మరోసారి ఇదే తరహా రచ్చ మొదలై... పార్టీ పరువు రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్ళు.
ఏపీ ప్రజా ప్రతినిధులకు కూడా టీటీడీ తీపి కబురు చెప్పింది.. ఇప్పటి వరకు వారానికి నాలుగు రోజులు మాత్రమే సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకుంటున్న టీటీడీ.. ఇకపై ఏపీ ప్రజా ప్రతినిధులకు సంబంధించిన సిఫార్సులేఖలపై ఆదివారం కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)..
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈనెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే, వైసీపీకి చెందిన కే వెంకటరమణ హత్యకాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవపడ్డాడు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యార్థులనుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసిన ముందస్తు…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్.. అయితే, గతంలో కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. నేటి కేబినెట్ లో వైఎస్ఆర్ పేరుకు అదనంగా కడప పేరును చేరుస్తూ తీర్మానం చేశారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.. అయితే, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఛాంబర్ కి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్లు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన తుది విచారణ చేపడతామని పేర్కొంది.. వంశీ రిమాండ్‌ను ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది కోర్టు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది కేబినెట్.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది..