మహానంది క్షేత్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది.. పాతికేళ్ల నాటి నాగనంది సదనం కూల్చివేత సంఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులు శివ సన్నిధిలో మృత్యువాత పడ్డారు. క్షేత్రంలోని గాజులపల్లె టోల్ గేట్ వద్ద పాతికేళ్ల క్రితం భక్తుల కోసం నాగనంది సదనం వసతి గృహాలను నిర్మించారు ఆలయ అధికారులు.
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కావలి గ్రీష్మ.. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. దీంతో.. ఏపీ మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు గ్రీష్మ..
అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన శిక్షణను బలోపేతం చేసే దిశగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు..
మనమిత్ర యాప్ ప్రపంచంలోనే మెరుగ్గా తీర్చిదిద్దుతాం అన్నారు మంత్రి నారా లోకేష్.. జూన్ 30వ తేదీ నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వందరోజుల్లో ఏఐ ఆధారిత వాయిస్ ఎనేబుల్ సేవలు తెస్తాం అన్నారు.. కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్.. అలాగే పౌరులకు సంబంధించిన సమాచారం కూడా పూర్తి భద్రంగా ఉంటుందన్నారు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల అంటే ఏప్రిల్ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం.. ఇక, అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
వల్లభనేని వంశీ మోహన్‌కు మరోషాక్ తగిలింది.. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు..
థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు న్యాయమూర్తి.. సీఐడీ విచారణపై పోసానిని ప్రశ్నించారు గుంటూరు కోర్టు జడ్జి.. విచారణ సక్రమంగా జరిగిందా? థర్డ్ డిగ్రీ వాడారా? అని ప్రశ్నించగా.. జడ్జి ప్రశ్నలకు సమాధానమిచ్చిన పోసాని.. థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు, లాయర్ల సమక్షంలోనే విచారణ జరిగిందని తెలిపారు.
ఇవాళ సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు.. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు.. అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు.