CM Chandrababu: ఇవాళ ఉదయం 9. 30 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు మరి కొందరు మంత్రులు, నేతలు హాజరు కానున్నారు. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉగాది వేడుకలకు కూడా సీఎం పాల్గొననున్నారు. ఇక, సాయంత్రం పీ4 కార్యక్రమం ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం.. సాయంత్రం 5 గంటలకు పీ4 కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు.