రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకున్న మెడికల్ విద్యార్థి అంజలి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ వైద్యులు. అంజలి బ్రెయిన్ రికవరీ అనుమానాస్పదంగా ఉందన్నారు. ఇంప్రూవ్ మెంట్ ఛాన్స్ తక్కువ ఉన్నాయని స్పష్టం చేశారు. రాజమండ్రి కిమ్స్ హాస్పటల్లో వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. అంజలి వేకురోనీమ్ అనే పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ పై ఉందని వివరించారు.
Also Read:Peddi : చరణ్ ఫ్యాన్స్ దాహం తీర్చే న్యూస్ చెప్పిన బుచ్చిబాబు
బ్లీడింగ్ ఆగిపోవడం వలన బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో డైలీ మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు. ఎంఆర్ ఐ స్కానింగ్ చేశామని తెలిపారు. మిగతా అవయవాలు రికవరీ అవుతున్నప్పటికీ బ్రెయిన్ రికవరీ లేటుగా ఉందన్నారు. బిపి అన్నీ బాగానే ఉన్నాయని, రికవరీ అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. ఇది ఎలా మారుతుందో చెప్పలేమని, నేచురల్ గా రికవరీ అవ్వాలి తప్ప గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు.
Also Read:Kamal Haasan : కమల్ హాసన్ అందరి ముందే నన్ను తిట్టాడు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉందని, ఇంకా బ్రెయిన్ డెడ్ అవ్వలేదని వివరించారు. వెంటిలేటర్ సపోర్ట్ తో ఉన్నప్పటికీ ఇంప్రూవ్ మెంట్ ఛాన్స్ తక్కువేనని అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎటువంటి అపోహలకు తావు లేకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.