Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!
- హారర్ కామెడీగా ‘రాకాస’.. టీజర్‌తో అంచనాలు పెంచిన సంగీత్ శోభన్
- నిహారిక నిర్మాణంలో వెరైటీ కంటెంట్
- భారీ తారాగణంతో వస్తున్న రాకాస
- ఏప్రిల్ 3, 2026న గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakasa Teaser Talk in telugu : ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సంగీత్ శోభన్, ఇప్పుడు ఒక వెరైటీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ముందుకు రాబోతున్నారు. మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రాకాస’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Internet Shutdown: శ్రీనగర్‌లో ఇంటర్నెట్ క్లోజ్.! భారీ నిరసనలతో అలజడి.!
Also Read
- Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
- Shruti Haasan: ఆ బంధంలో బందీగా ఉండలేను.. పెళ్లి కాకుండానే తల్లిని అవుతా!
- The Paradise: తెలంగాణ ఫేవరెట్ 'సర్వపిండి'.. 'ది ప్యారడైజ్' ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
- RC17 : అక్టోబర్ 20న సుకుమార్ - రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
టీజర్ ఎలా ఉందంటే?
“నరకం నుంచి సందేశం వస్తుంది”, “మన ఊరి శాపం ఇది” అనే సీరియస్ డైలాగ్స్‌తో టీజర్ ప్రారంభమై ఆకట్టుకుంటోంది. అమెరికా నుంచి వచ్చిన ఓ యువకుడు తన సొంత ఊరిలోని ఒక పాత బంగ్లాలో చిక్కుకోవడం, అక్కడ అతనికి ఎదురైన వింత అనుభవాలు ఏంటి? అసలు ఆ ఊరికి ఉన్న శాపం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అన్న కోణంలో టీజర్ సాగింది. ఒకవైపు భయపెడుతూనే, మరోవైపు సంగీత్ శోభన్ మార్కు కామెడీతో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
నిర్మాణ విలువలపై నిహారిక ముద్ర
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నేషనల్ లెవల్లో సక్సెస్ అందుకున్న నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సల్‌తో కలిసి ఆమె ఈ మూవీని రూపొందిస్తున్నారు. అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
భారీ తారాగణం
సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ , ’90s’ సిరీస్ ఫేమ్ రోహన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారర్ , కామెడీ మేళవింపుతో రానున్న ఈ ‘రాకాస’ చిత్రం 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.
Putin Rection : ఇది ‘క్రూరమైన హత్య’.. ఖమేనీ మృతిపై పుతిన్ రియాక్షన్..
తాజావార్తలు
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!