Komatireddy Venkat Reddy: నల్లగొండ నుంచి ఫ్లోరైడ్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం
- నల్లగొండలో ఫ్లోరైడ్‌కు శాశ్వత చెక్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా
- ఎస్‌ఎల్‌బీసీ స్వరంగం పనులు వేగవంతం.. 2028 నాటికి పూర్తి లక్ష్యం
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కొత్త ఊపు.. చెరువులు నింపే దిశగా అడుగులు
- రహదారుల విస్తరణతో జిల్లాలో సమగ్ర అభివృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. నల్లగొండ మండలం రాముల బండలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధి , సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ జిల్లాకు వరప్రదాయిని అయిన ఎస్ఎల్బిసి స్వరంగం పనులపై మంత్రి స్పష్టతనిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించినప్పటికీ, దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, దాంతో పనులు నిలిచిపోయాయని ఆయన గుర్తుచేశారు. అయితే, ముఖ్యమంత్రి , ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మళ్లీ పనులను వేగవంతం చేశామని, ఇప్పటికే 18 మీటర్ల పని పూర్తయిందని తెలిపారు. 2028 జూన్ నాటికి ఈ స్వరంగ మార్గాన్ని పూర్తి చేసి, జిల్లా నుంచి ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా పారద్రోలుతామని ఆయన భరోసా ఇచ్చారు.
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్లైన్.!
17 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చెరువులను నింపుతున్నామని చెప్పారు. రాబోయే మూడు నెలల్లో మరో రూ. 200 కోట్లు ఖర్చు చేసి, లైనింగ్ పనులు పూర్తి చేస్తామని, తద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
సాగునీటితో పాటు రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నామని మంత్రి తెలిపారు. నల్లగొండ నుంచి మునుగోడుకు వెళ్లే రహదారిని డబుల్ రోడ్డుగా మారుస్తామని, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Salman Ali Agha: “ఈ బలహీనతే మా కొంప ముంచింది”.. పాక్ కెప్టెన్ సంచలన స్టేట్‌మెంట్
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!