CM Chandrababu: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఇక, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయ పరుస్తున్నాం.. ప్రజలు ముందుకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.
Read Also: Chiru-Anil: చిరు-అనిల్ మూవీ షురూ.. క్లాప్ కొట్టిన వెంకీ!
ఇక, ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ నడుస్తుంది.. వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ పాలన తెచ్చాం.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్.. ఏఐతో అన్ని సుసాధ్యాలే అని ఆయన చెప్పారు. ఈ ఏడాది రూ. 3 లక్షల 22 వేల కోట్లు బడ్జెట్ పెట్టాం.. గత ఐదేళ్లలో అందరికీ అవమానాలే జరిగాయని ఆరోపించారు. మన సమస్యలకు ఏఐ సులభంగా పరిష్కారం చూపిస్తుంది.. సంపద కొందరికే పరిమితం కాకూడదు.. సంపద ప్రతి ఒక్కరికీ అందాలి.. అప్పుడు నిజమైన సమ సమాజం సాధ్యం అవుతుందన్నారు. దీన్ని ఓ పాలసీగా తీసుకొస్తున్నాం.. ఇక నుంచి ఎవరూ పేదలుగా ఉండకూడదు అని సూచించారు. అందరికీ మంచి విద్య, వైద్యం అందాలి.. ఇది నా జీవితాశయం.. మార్గదర్శి, బంగారు కుటుంబం, పీ4 కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.