జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతు.. జగనన్నను చూసి అధికారులు పరిగెత్తారని అవినాష్ చెప్పడం విడ్డురంగా ఉంది.. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడంలో వాళ్ళు దిట్ట.. సీబీఐ విచారణ జరిగింది.. జగన్, అవినాష్ లకు అంతా తెలుసు.. అవినాష్ రెడ్డికి వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా.. పాడా నిధులు 800కొట్లు పాడు చేశారు.. చిత్రావతి నీళ్లు పులివెందులకే చేరలేదు.. వై నాట్ 175 అని 11స్థానాలకు దిగజారిపోయాడు.. మళ్ళీ పోటీ చేస్తాం అంటున్నారు.. ఆ ఉన్న 11సీట్లు కూడా రావు.
Also Read:WhatsApp Update: ఇకపై వాట్సాప్ స్టేటస్లో మ్యూజిక్.. ఎలా పెట్టుకోవాలంటే?
అయిదు రోజుల క్రితం జగన్ పై చేసిన వాఖ్యలపై ఎంపీ అవినాష్ స్పందించారు.. నన్ను బాగా గమనిస్తున్నారు.. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతారని మాకేమైనా ముందే తెలుసా.. వచ్చిన ప్రతి సారి రెండేళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తానని.. నువ్వు కేసుల్లో ఇరుక్కున్నావు.. వివేకా హత్య మీకు తెలిసి జరిగింది కాదా.. మీరు మీరు కొట్లాడుకొని మా మీద పడి చచ్చారు ఎందుకు.. అయిదు రోజులు నేను కనపడటం లేదు క్లబ్ లో ఉంటాడని ఆరోపించారు.. 800కొట్లు పాడా నిధులు వాడి బిల్లులు చెల్లించలేదు.. కడపకు నువ్వు ఏమి చేసావు.. కడపకు జేఎస్ డబ్ల్యూ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది..
Also Read:MI vs GT: మొదటి గెలుపు కోసం తలబడనున్న ఇరు జట్లు.. విజయం ఎవరిని వరించేనో..!
30ఏళ్ళు నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు.. ఇంట్లో లెక్క పైసా బయటకు తీయరు సాయం చెయ్యరు.. ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తుంది.. ఆ పథకాలు అవినాష్ రెడ్డికి ఏమైనా తెలుసా.. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ లేదు.. ఇప్పుడు అమలు చేస్తున్నాం.. ముందు వివేకా హత్య కేసులో మీరు ముద్దాయిలు కాదని తేల్చండి.. జగన్, అవినాష్ లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. ఈఎంఐ కట్టలేని పరిస్థితి కి కారణం వాళ్లిద్దరే.. అన్నదమ్ములు ఇద్దరు తోడుదొంగలు.. అసెంబ్లీ కి రాడు.. సూపర్ సిక్స్ అమలు చేస్తాం.. జగన్ అప్పుల దరిద్రమే అమలుకు ఆలస్యం..
Also Read:ABD: జట్టు ఇప్పుడు సరైన బ్యాలెన్స్‌గా ఉంది.. ఈసారి చాలా స్ట్రాంగ్ గా ఉంది
మీలా డూప్ మాటలు మాట్లాడం.. అవినాష్ ను ఎంపీ గా, జగన్ ను ఎమ్మెల్యే గా ఒడిస్తాం.. దాల్మియా సిమెంట్ బాధితులకు న్యాయం జరిగితేనే విస్తరణ పనులు.. దుమ్ము పట్టిన పంటలకు పరిహారం.. అన్నింటికి ఆమోదం చెబితేనే దాల్మీయ పరిశ్రమ విస్తరణ.. లిక్కర్ స్కామ్ భారీ స్కామ్.. విద్యలో, గనుల్లో కూడా స్కామ్.. స్కీంలు తెలియవు.. స్కాంలు మాత్రమే తెలుసు.. ఉదయం గుండె పోటు మధ్యాహ్నం మేము చెక్కి చెక్కి పొడిచామని చెప్పారు.. ఎఐ ని వదిలి ఎ8ను తెచ్చారు.. జగన్ అవినాష్ లు లోపలికి పోయే సీజన్ వచ్చిందని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు.