ఏపీలో పేదరిక నిర్మూలన నా జీవిత లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దాని కోసమే చివరి వరకు పనిచేస్తానన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల చేసే పనుల వల్ల పేదలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం చేపట్టే పనుల వల్ల పేదలకు మేలు చేకూర్చాలని నా ఆశయం. స్వర్ణ భారత్ ట్రస్ట్ మాదిరి అనేక సంస్థలు పనిచేయాలి. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్య నాయుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో విలువలు ఉన్న నేతలతో పనిచేసే వాడిని. ఇప్పుడు పనిచేసే వారిని చూస్తుంటే నిరుత్సాహం కలుగుతోంది. ప్రస్తుతం పిల్లల్లో అసలు క్రియేటివిటీ కరువు అవుతోంది. అందరు పిల్లలు మొబైల్ ఫోన్స్ కి అడిక్ట్ అవుతున్నారు. పిల్లల్లో క్రియేటివిటీ పెంచేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చంద్రబాబు తెలిపారు.