YS Jagan: ప్రంపచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే, ఈరోజు (మార్చ్ 30) ఉదయం 9.30 గంటలకు వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం పంచాంగ శ్రవణం జరగనుంది. ఈ ఉగాది వేడుకలకు పలువురు వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Ugadi
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2025