వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ గ్రేటర్ విశాఖను కైవసం చేసుకు నేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారం చేతులు మారిన వెంటనే మేయర్ హరి వెంకట కుమారికి పదవీ గండం తప్పదనే ప్రచారం విస్త్రతంగా జరిగింది. అయితే, సవరించిన మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం నాలుగేళ్ల గడువు పూర్తి కావాలి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.. ఆ గడువు…
అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులకు ఎంతో నమ్మకం.. రోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు.. కార్తీక మాసం పర్వదినాలలో అయితే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.. అయితే, అన్నవరం సన్నిధిలో అపచారం జరిగింది.. స్వామివారికి సంబంధించిన సత్య నికేతన్ సత్రంలో మందు బాటిల్స్ కనిపించాయి..
పోసానిపై మరో ఫిర్యాదు అందింది.. తనకు ఉద్యోగం ఇప్పిస్తా అని 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి టీడీపీ గ్రీవెన్స్ లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. ఈ సారి కూడా కేబినెట్ ముందు కీలక అంజెండా ఉంది.. సీఆర్డీఏ ఆథారిటీలో అమోదించిన 37,702 కోట్ల టెండర్ల గాను పనులు చేపట్టేందుకు అమోదం తెలపనుంది కేబినెట్.. ఇక, కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది సీఆర్డీఏ.. ప్రస్తుతం సీఆర్డీఏ చేపట్టనున్న రూ.22,607 కోట్ల విలువైన 22 పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది..…
Chennai: కాలం ఎంత వేగంగా మారిపోయినా, కొందరి జీవితాల్లోని సంఘటనలు మాత్రం గుండెను కదిలించేలా ఉంటాయి. ఇలాంటి ఓ సంఘటన తాజాగా చెన్నైలో వెలుగుచూసింది. ఇరవై ఏళ్ల క్రితం తన కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి, రెండు రాష్ట్రాల అధికారుల సహాయంతో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. మన్యం జిల్లా పార్వతీపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు, కొన్నేళ్ల క్రితం తన స్నేహితులతో కలిసి నిర్మాణ పనుల నిమిత్తం పాండిచ్చేరి వెళ్ళే రైలులో ప్రయాణం…
ఏపీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి తన కుమారులను దారుణంగా చంపేశాడు. అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఇద్దరు కుమారుల కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచేశాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ.. ఇద్దరు బాలురు తుది శ్వాస వదిలారు. ఈ ఘటన అనంతరం ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా, ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని అందుకే చంపేసి…
సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలు మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది.
తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ముందుగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. "ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్ళు సమైక్యాంధ్ర సీయంగా,…
ఉమ్మడి కర్నూలు జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు బైరెడ్డి వర్సెస్ బైరెడ్డిగా మారుతున్నాయా అంటే.. అవును అనే విధంగానే ఆరోపణలు, విమర్శలు.. కౌంటర్లు, కౌంటర్ ఎటాక్‌లు నడుస్తున్నాయి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత బైరెడ్డి సిధార్థ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆడదాం ఆంధ్ర పై విచారణకు అదేశించడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. అయితే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి.