రుమలలో ఉన్న వ్యవస్థను స్వయంగా పరిశీలన జరిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.. ముందుగా నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్ల వద్దకు చేరుకున్న ఆయన.. అటు తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను పరిశీలన జరిపారు.
అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పను.. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబధిత అధికారులపై చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర నా లక్ష్యం.. అక్టోబర్ 2 తేదీ నాటికి ఎక్కడ చెత్త లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు..
పార్లమెంట్లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు..
వైఎస్ వివేకా కేసులో ఇన్వెస్టిగేషన్ ఆగిపోయిందన్నారు వైఎస్ సునీత.. ఈ దారుణమైన హత్య గురించి పోరాడుతూనే ఉన్నా.. ఇంత అన్యాయం జరిగినా.. నాకు న్యాయం జరగలేదన్నారు.. అయినా, న్యాయపోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఎంతవరకైనా పోరాటం చేస్తానన్న సునీత.. నిందితుల కంటే మాకు, మా కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు..
వివిధ అంశాలపై ఇప్పటికే ఎన్నో సార్లు బహిరంగ లేఖలు రాస్తూ వచ్చిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య.. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ అంటూ ఓ లేఖ రాశారు.. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుమారు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. మరో 50 వేల కోట్లు ఖర్చు చేయడనికి కూడా సిద్ధం అవుతున్నారు.. పరిపాలన…
హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు కౌంటరిచ్చారు. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దన్నారు పవన్ కల్యాణ్... భాష వద్దు కానీ.. డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ కామెంట్స్ స్పందించిన ప్రకాష్‌రాజ్.. "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్…
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.