గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సీఐడీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయటం కోసం సమయం కోరారు సీఐడీ పోలీసులు..
జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా శుభాకంక్షలు తెలిపిన వారితో పాటు.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదులు తెలుపుతూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.. సీఎం చంద్రబాబు మొదలు కొని.. జనసేన కార్యకర్తల వరకు ఎవరినీ వదలకుండా ప్రత్యేక ధన్యవాదులు తెలిపిన పవన్ కల్యాణ్ ట్వీట్లు కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.
రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో సమాధానం ఇస్తూ క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ.. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని.. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత... రుణం ఎంత అనేది చర్చించి చెబుతాం. హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నాం.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది.. బెట్టింగ్ యాప్స్ కోసం ప్రచారం చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు వణికి పోతున్నారు.. సినీ రాజకీయ టీవీ రంగాన్ని చెందిన నటీనటులు బెట్టింగ్ యాప్‌ల కొరకు ప్రచారం చేశారు.. దీనికి తోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పించారు.. దీనికి తోడు మంచు కుటుంబంలో సెన్సేషనల్ అయిన మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేశారు..
అతని టార్గెట్ ఒకటే.. అమ్మాయిలు, ఆంటీలను మోసం చేయడం. పెళ్లిలో కోసం వెబ్సైట్లో వెతుకుతున్న అమ్మాయిలను రెండో పెళ్లి కోసం వెతుకుతున్న ఆంటీలనే మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పటివరకు ఒక వెయ్యి మందిని మోసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి దగ్గరనైనా కనీసం 10 లక్షల రూపాయలను కొట్టేస్తాడు.
చోటా, మోటా నాయకులు కొందర్ని వెనకేసుకుని తిరుగుతూ అదితి ఎంకరేజ్ చేస్తున్నారని, వాళ్లేమో... పేనుకు పెత్తనం ఇచ్చిన చందాన చెలరేగిపోతున్నారన్నది విజయనగరం టీడీపీ సీనియర్స్ మాట. ప్రత్యేకించి అశోక్గజపతితో కలిసి రాజకీయ ప్రయాణం చేసిన వారిని ఇప్పుడీ ఛోటా మోటా లీడర్స్ టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యే అదితి వెనక తిరుగుతున్న అనురాధ బేగం అనే నాయకురాలు బంగ్లాలో సర్వం నేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.
కొన్ని నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా.. అది వివాదాస్పదంగానే మారుతూ ఉంటుంది. అక్కడి నాయకుల రాశి ఫలాలు అలా ఉంటాయని అంటారు కొందరు. ఇంకా కరెక్ట్‌గా మాట్లాడుకోవాలంటే... రాశి ఫలాలు అనేకంటే.... వాళ్ల మాటలు, చేతలు అనడం కెరక్ట్ అంటారు ఎక్కువ మంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇలాంటివి మాత్రం తప్పవు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా రాప్తాడు.
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.. గన్నవరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులోని మిస్టరీని ఛేదించారు ఆత్కూరు పోలీసులు.. గన్నవరం మండలం వీరపనేని గూడెంలో ఈనెల 9వ తేదీన స్నేహితురాలి ఇంటి నుండి రాత్రి సమయంలో బయటకు వచ్చిన మైనర్ బాలిక అదృశ్యమైంది..